Wednesday, March 18, 2026
Homeఆంధ్ర ప్రదేశ్జగన్ సరికొత్త నిర్ణయం... కొత్త వ్యూహకర్తతో రంగంలోకి దిగనున్న వైసిపి!.

జగన్ సరికొత్త నిర్ణయం… కొత్త వ్యూహకర్తతో రంగంలోకి దిగనున్న వైసిపి!.

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ కీలక మలుపులు తిరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇరు పార్టీలు కూడా కొత్తగా భవిష్యత్తు రాజకీయాల గురించి ఆలోచిస్తున్నాయి. అందులో భాగంగానే పార్టీకి కావాల్సిన వ్యూహకర్తలను దగ్గరుండి మరీ వెతుక్కుంటున్నారు. ఇక చంద్రబాబు మరియు జగన్ ఇద్దరు కూడా పార్టీ నీ బలోపితం చేయడానికి సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇక 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగానే ప్రముఖ రాజకీయ యువకర్త ప్రశాంత్ కిషోర్ ఆనాడు వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించడం జరిగింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీతో చేరినప్పటి నుంచి… రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నో అడుగులు వేయించారు. పాదయాత్ర చేయించడం కానీ.. లేదా పార్టీలో నాయకులను చేర్పించడం కానీ… ప్రచారాలు పెద్ద ఎత్తున చేయించడం కానీ… ఇలా ఎన్నో ప్రశాంత్ కిషోర్ వెనక ఉండి పార్టీని నడిపించారు. ఆ ఎలక్షన్లలో ఇక ఏకంగా జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలిచి రికార్డు సృష్టించారు.

ఇక ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికలలో టిడిపికి అనగా కూటమికి సపోర్ట్ చేయగా… ఆ ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. దీంతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పార్టీ బలోపేతం కోసం రాజకీయ వ్యూహకర్త కోసం ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఐ ప్యాక్ లో ప్రశాంత్ కిశోరుకు సహచరుడిగా పనిచేసిన ఒక ప్రముఖ రాజకీయ వ్యూహకర్తతో వైసిపి పార్టీకి సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నట్లు పార్టీ ముఖ్య నేతల నుంచి సమాచారం అందుతుంది. 2029 ఎన్నికల వరకు ఆ వ్యూహకర్త సేవలు అందించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 2029 ఎన్నికల లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు పార్టీకి మేలు చేస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.

వెంటనే టెహ్రాన్ ను ఖాళీ చేయండి, ట్రంప్ వార్నింగ్!

ప్రధాని మోదీ పర్యటన చరిత్రాత్మకం.. సైప్రస్ ప్రెసిడెంట్ నికోస్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments