Saturday, February 28, 2026
Homeతెలంగాణమాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పై దాడి.!

మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పై దాడి.!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ  బ్యూరో :సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పై దాడి జరిగింది. తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలతో కాంగ్రెస్ నేతలు గొడవ పడ్డారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పై కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో పలు కార్లు ధ్వంసం అయ్యాయి. లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు పోలీసులు. తమపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపించారు.

Read More : జైలులో కవితకు సీరియస్.. ఎయిమ్స్ లో అడ్మిట్

గాదరి కిషోర్ పై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం అవుతుందన్నారు. ఇదేనా రేవంత్ రెడ్డి ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయటం చూస్తుంటే రేవంత్ రెడ్డికి ప్రశ్నించే వాళ్లంటే భయం పట్టుకుందన్నారు. ఇలాంటి ఎన్ని గుండాగిరిలు చేసిన భయపడేది లేదన్నారు. ముఖ్యమంత్రి నిజ స్వరూపాన్ని ప్రజల ముందు ఉంచేందుకు ఎన్ని దాడులు చేసిన వెనకడమన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments