పుష్ప-2 సినిమాలోని ఫీలింగ్స్ అనే సాంగ్ కు తాజాగా 85 ఏళ్ల బామ్మ డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప సినిమా అనేది ఎంత పెద్ద రికార్డు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని సాంగ్స్ కు ప్రపంచమంతటా కూడా చాలా రీల్స్ చేశారు. కానీ 85 ఏళ్ల బామ్మ,అది కూడా రొమాంటిక్ సాంగ్కు డాన్స్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Read More : కేటీఆర్ కేసులో కీలక పరిణామాలు!.. కేటీఆర్ వైపే అందరి వేళ్ళు?
సోషల్ మీడియాలో ఈ సాంగ్కు పెద్ద రెస్పాన్స్ రావడంతో ఈ సాంగ్ పై కొన్ని లక్షల రీల్స్ పుట్టుకొచ్చాయి. కాగా తాజాగా 27 ఏళ్ల యువకుడితో 85 ఏళ్ల బామ్మ డాన్స్ చేయడం సోషల్ మీడియాను షేక్ చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తమిళ వెర్షన్ లో ఉన్న ఈ సాంగ్ కు పండు ముసలామా అయినా కానీ సినిమాలో రష్మిక చేసినట్లుగా చేసేసింది. దీంతో ఈ ముసలామ పై ప్రశంసలు వెల్లువడుతున్నాయి. అంతేకాకుండా ఈ రీల్ కు కొన్ని లక్షల్లో వ్యూస్ తో పాటుగా లక్షల్లో లైకులు కూడా రావడంతో ఇన్స్టాలో నెంబర్ వన్ గా ట్రెండ్ అవుతుంది.
Read More : తిరుపతికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి!..
దాదాపుగా 85 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంతో డాన్స్ చేయడంతో అందరూ కూడా శభాష్ బామ్మ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా సినిమా విడుదలై నేటికీ 1800 కోట్ల వసూళ్లు రాబట్టిన విషయం అందరికీ తెలిసిందే. కాగా సినిమా విడుదలైన రెండు రోజులకు తొక్కిసలాటలో మహిళా చనిపోవడం వల్ల అల్లు అర్జున్ ను అరెస్టు చేసి జైలుకు పంపించగా మళ్లీ మరుసటి రోజు బెయిల్ మీద తిరిగి ఇంటికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
Read More : మందుబాబులకు షాక్.. తెలంగాణలో కింగ్ పిషర్ బీర్లు బంద్!