Homeక్రీడలుమరో 3 రోజుల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సందడి..!

మరో 3 రోజుల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సందడి..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 14 నుండి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం విద్యాశాఖ పక్కా ఏర్పాట్లు చేసింది. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయి.

విద్యార్థులను ఉదయం 8:30 నుండి 9:30 వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. హాల్ టికెట్లు ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ప్రధానోపాధ్యాయుడి సంతకం లేకపోయినా హాల్ టికెట్ చెల్లుబాటు అవుతుంది. పరీక్షా కేంద్రాల వద్ద సిసి కెమెరాల నిఘా ఉంటుంది మరియు సెల్‌ఫోన్లను కఠినంగా నిషేధించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు