న్యూఢిల్లీ, క్రైమ్మిర్రర్: గడిచిన వందేళ్లలో జూన్ నెలలో అత్యల్ప వర్షపాతం నమోదవ్వడం ఇది మూడోసారి. 1927 – 2026 మధ్య 2009లో 87.5 మిల్లీ మీటర్లు, 2014లో 92.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మూడు అత్యల్ప వర్షపాతాలు కూడా ఇరవై ఏళ్లలోనే నమోదవ్వడం విశేషం. ముఖ్యంగా మధ్య భారతదేశంలో వర్షపాతం లోటు అత్యధికంగా 54 శాతం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ లక్షణాలు అన్నీ చూస్తుంటే ఎల్నినో పరిస్థితులను చూయిస్తుందని నిపుణులు చెబుతున్నారు.వర్షాకాలం మొదలైనా దేశంలో ఎక్కడా చినుకు జాడే కనిపించలేదు. గత వందేళ్లలో జూన్లో ఇంత తక్కువ వర్షపాతం నమోదవ్వడం ఇది మూడోసారి. భారత వాతావరణశాఖ గణాంకాల ప్రకారం జూన్ నెలలో 42 శాతం లోటు వర్షంపాతం నమోదైంది. 1927 – 2026 మధ్య జూన్లో ఇంత తక్కువ వర్షపాతం నమోదవ్వడం ఇది మూడోసారి.జూన్ నెలలో దేశవ్యాప్తంగా సాధారణంగా 157.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవ్వాలి.
Also Read:శ్రీకాకుళంలో దారుణం… ఇద్దరు బిడ్డల గొంతు కోసిన తల్లి
కానీ ఇప్పటి వరకు కేవలం 92.2 మిల్లీ మీటర్ల వర్షపాతమే నమోదైంది. ఒకవేళ నెలాఖరు రోజున వర్షాలు కురిసినా 100 మిల్లీ మీటర్ల వద్దే ఆగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ ఏడాది జూన్ నెలలోనే కరువు ఛాయలు కనిపిస్తున్నాయని, ఎల్నినో ప్రభావం అప్పుడే మొదలైందా అని అందరూ అనుకుంటున్నారు.గత శతాబ్దంలో జూన్ నెలలో 92.2 మిల్లీ మీటర్ల కంటే తక్కువ వర్షపాతం రెండు సార్లు నమోదైంది. 2009లో 87.5 మిల్లీ మీటర్లు, 2014లో 92.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రెండూ కూడా గత 20 ఏళ్లలోనే రావడం గమనార్హం. దీన్ని బట్టి వర్షపాతం ఏటికేడు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ లోటు వర్షపాతం నమోదైనా అత్యధిక లోటు మాత్రం మధ్య భారతదేశంలోనే.
Also Read:కేంద్రప్రభుత్వం కీలక అడుగు….!బుల్లెట్ ట్రైన్ సర్వే షురూ…
మధ్య భారతంలో 54 శాతం లోటు ఉంటే.. తూర్పు, ఈశాన్య భారతంలో 41 శాతం లోటు, వాయువ్య భారతంలో 30 శాతం లోటు, దక్షిణ భారతంలో 28 శాతం లోటు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. దేశంలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఒకేసారి ఇంత భారీ వర్షాభావం నమోదవడం అరుదైన విషయమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.ఈ పరిస్థితులకు ఎల్నినో ప్రభావమే ప్రధాన కారణమై ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎల్నినో ప్రభావం మోస్తరు స్థాయికి చేరువవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడుతున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే, భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూలై తొలి వారంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో వర్షాభావ పరిస్థితి కొద్దిమేర తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
Also Read:వారణాసిలో మాంసం బంద్…!ఇక శాఖాహారమే…?