Homeతెలంగాణయాద‌గిరి గుట్ట‌కు కొత్త పాల‌క‌వ‌ర్గం ఏర్పాటు...! చిరంజీవి భార్య సురేఖ‌కు చోటు...

యాద‌గిరి గుట్ట‌కు కొత్త పాల‌క‌వ‌ర్గం ఏర్పాటు…! చిరంజీవి భార్య సురేఖ‌కు చోటు…

యాద‌గిరిగుట్ట‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. యాద‌గిరి శ్రీ‌ల‌క్ష్మి న‌రసింహా స్వా దేవ‌వ‌స్థానానికి నూత‌న పాల‌క మండ‌లిని ఏర్పాటు చూస్తూ ఉత్త‌ర్వ‌లు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో మొత్తం 18 మంది సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ పాలకమండలి పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. కాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంఎస్‌ఎన్‌ గ్రూప్ చైర్మన్ డాక్టర్ మన్నె సత్యనారాయణ రెడ్డిని బోర్డు చైర్మన్‌గా నియమించారు. బోర్డులో చెన్నూరు ఎమ్మెల్యే కార్మిక‌క శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, చిరంజీవి భార్య కొణిదెల సురేఖ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామితో పాటు పలువురు ప్రముఖులకు సభ్యులుగా అవకాశం కల్పించారు. ఆలయానికి సంబంధించిన ఏడు మంది ఎక్స్-అఫీషియో సభ్యులు కూడా బోర్డులో భాగంగా ఉంటారు. ఫౌండర్ ట్రస్టీలకు కూడా పాలకమండలిలో ప్రాతినిధ్యం కల్పించారు.

Also Read:శ్రీకాకుళంలో దారుణం… ఇద్దరు బిడ్డల గొంతు కోసిన తల్లి

వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, వైటీడీఏ వైస్ ఛైర్మన్, ఆలయ ఈవో ఎక్స్‌-అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఎక్స్‌-అఫీషియో, ఫౌండర్ ట్రస్టీ సభ్యులు మినహా మిగిలిన వారి పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. ఈ మేరకు దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఛైర్మన్‌గా నియమితులైన మన్నె సత్యనారాయణ రెడ్డికి ఉస్మానియా, పాలమూరు విశ్వవిద్యాలయాల నుంచి రెండు పీహెచ్‌డీలు ఉన్నాయి

ఈ బోర్డు బాధ్యతలు…

Also Read:కేంద్ర‌ప్ర‌భుత్వం కీల‌క అడుగు….!బుల్లెట్ ట్రైన్ సర్వే షురూ…

ఆలయ పరిపాలనను పర్యవేక్షించడం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం. ఆలయ అభివృద్ధి పనులకు ప్రణాళికలు పొందించడం.
దేవస్థానం ఆదాయం, ఆస్తులు, పరిపాలనా వ్యవహారాలపై నిర్ణయాలు తీసుకోవడం. అదే సమయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో ఆలయ భూముల కేటాయింపులకు టీటీడీ తరహాలో ప్రత్యేక భూకేటాయింపు విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ భూముల యాజమాన్యం పూర్తిగా దేవస్థానం వద్దే ఉండేలా మార్గదర్శకాలు సిద్ధం చేయాలని సూచించారు.

Also Read:వార‌ణాసిలో మాంసం బంద్‌…!ఇక శాఖాహార‌మే…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు