Homeతెలంగాణఈ నెల 10న పాఠశాలలు, కళాశాలల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు

ఈ నెల 10న పాఠశాలలు, కళాశాలల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు

క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం హైదరాబాద్‌లో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు సంయుక్తంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో AISF, SFI, PDSU, AIDSO, AIFDS, AISB, AIPSU తదితర విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థల యాజమాన్యాలు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్ చేపట్టనున్నట్లు బీసీ జేఏసీ (BC JAC) ఒక ప్రకటనలో తెలిపింది. ఫీజు బకాయిల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

తెలంగాణ స‌ర్కార్‌ కీల‌క నిర్ణ‌యం…! ఇంట‌ర్‌లో వారం వారం ప్రాక్టిక‌ల్స్‌…

ఏపీకి సీఎం తొత్తు కావొచ్చు… ప్రజలు కాదు: కవిత

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు