Homeజాతీయంబీజేపీ కీల‌క నిర్ణ‌యం...రెండు రాష్ట్రాలకు కొత్త సీఎంలు...?

బీజేపీ కీల‌క నిర్ణ‌యం…రెండు రాష్ట్రాలకు కొత్త సీఎంలు…?

న్యూఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మంత్రివర్గంలోనే కాదు.. మొత్తంగా బీజేపీలోనూ సంస్థాగత మార్పులు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల తర్వాత పార్టీలో అత్యంత కీలక చక్రం తిప్పుతున్న జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను ప్రస్తుత బాధ్యతల నుంచి పక్కన పెట్టే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. సుదీర్ఘ కాలంగా పార్టీ అంతర్గత వ్యవహారాలను, ఎన్నికల వ్యూహాలను శాసిస్తున్న ఆయనను తిరిగి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు పంపేందుకు తెరవెనుక ముమ్మర కసరత్తు జరుగుతోందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.ఈ సంస్థాగత మార్పులతో పాటు, కీలక రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులను కూడా మార్చాలని పార్టీ అగ్రనాయకత్వం ఒక ఖచ్చితమైన ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు.

Also Read:Tirupati to Rameswaram: IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీ…!

ఇరు రాష్ట్రాల్లో తలెత్తిన పరిణామాలు, ప్రభుత్వాల ఇమేజ్ డ్యామేజ్ కావడంపై కేంద్ర పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాల పనితీరును గాడిలో పెట్టడమే కాకుండా, రాబోయే సవాళ్లను తట్టుకునేలా కొత్త నాయకత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ మార్పులు ఉండబోతున్నాయని విశ్లేషిస్తున్నారు.ముఖ్యంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుటుంబం చుట్టూ ముసురుకున్న భారీ భూ కుంభకోణం ఆరోపణలు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఉజ్జయిని పరిసర ప్రాంతాలలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు మరియు, రియల్ ఎస్టేట్ సంస్థలు వందలాది ఎకరాల భూస్కామ్‌కు పాల్పడ్డాయని ఆరోపణలు వస్తున్నాయి.

Also Read:రక్తపు మడుగులో యువకుడు, అసలు ఏం జరిగిందంటే…!

ఈ ఉజ్జయిని భూ వ్యవహారం “మహాకాల్ భూమి దోపిడీ”గా రాజకీయంగా తీవ్ర దుమారం రేపడం, జాతీయ స్థాయిలో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా మారడంతో ముఖ్యమంత్రి మార్పు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.మరోవైపు, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ పనితీరుపై కూడా అధిష్ఠానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆయన హయాంలో పరిపాలనా లోపాలు, వివాదాస్పద నిర్ణయాలు, పార్టీ శ్రేణులతో సమన్వయ లోపం వంటి అంశాలపై జాతీయ నాయకత్వానికి నివేదికలు అందాయి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగకుండా ముందస్తు జాగ్రత్తగా అక్కడ కూడా సమర్థుడైన నాయకుడికి పగ్గాలు అప్పగించాలని మోదీ-షా ద్వయం భావిస్తోంది.

Also Read:శ్రీకాకుళంలో దారుణం… ఇద్దరు బిడ్డల గొంతు కోసిన తల్లి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు