క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న కొద్ది గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో భారీ వర్షాలు</strong:- తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏపీలో మోస్తరు వానలు:- ఇటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని అంచనా వేస్తున్నారు.ఉభయ రాష్ట్రాల ప్రజలు వాతావరణ మార్పులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
వందేళ్లలో మూడోసారి కరువు…! జూన్‌లో తక్కువ వర్షపాతం నమోదు…
బీజేపీ కీలక నిర్ణయం…రెండు రాష్ట్రాలకు కొత్త సీఎంలు…?