ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ
Trending

శనివారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాదులోని ప్రజా భవన్ లో సమావేశం సమావేశం కానున్నారు. సమావేశం రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఉంటుంది. షెడ్యూలు తొమ్మిది పది లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న బకాయిలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇంకా పెండింగ్లో ఉన్న పది అంశాల పైన చర్చ జరగనుంది.

గ్రామపంచాయతీలు, మండలాల విలీనం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందులోను గురు శిష్యులుగా పేరుందిన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి బేటికి చాలా ప్రాముఖ్యత నెలకొంది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రుల భేటీలో అనేక అంశాలను చర్చించాలని ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు పలు డిమాండ్లు చేశారు. చూడాలి ఎంతవరకు చర్చలు జరుగుతాయో.

Related Articles

Back to top button