ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

రేవంత్ రెడ్డితో వైఎస్ జగన్ డీల్స్! చంద్రబాబు పరేషాన్

ఆంధ్రప్రదేశ్ లో ఘోర పరాజయంతో ఢీలా పడిన వైఎస్ జగన్ పార్టీ కేడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అనుబంధ విభాగాలకు కొత్త సారథులను నియమించారు. తనకు నమ్మిన బంట్లుగా ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీజే సుధాకర్ బాబులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల ఫలితాల తర్వాత చాలా ప్రాంతాల్లో వైసీపీ నేతలు దాడులకు గురయ్యారు. కొందరు భయంతో జిల్లా వదిలి పారిపోయారు. దీంతో పార్టీ నేతలకు భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్న వైఎస్ జగన్.. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైసీపీని కాపాడుకునేందుకు సీనియర్ నేతలతో జగన్ సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఓ ఖతర్నాక్ వ్యూహకర్తను అపాయింట్ చేసుకోవాలని వైఎస్ భావిస్తున్నట్లుగా టాక్.

2019లో వైసీపీ 153 సీట్లతో బంపర్ విక్టరీ కొట్టింది. ఈ విజయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం వల్లే సాధ్యమైందని జగన్ కూడా చెప్పుకొచ్చారు. పీకే టీం వ్యూహాలు ఫలించడంతో అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ హవా కనిపించింది. అయితే గత ఎన్నికల్లో పీకే జగన్ కు వ్యతిరేకంగా పని చేశారు. టీడీపీ విజయంలో పీకే పాత్ర కూడా ఉంది. జగన్ కోసం పని చేసిన ఐ ప్యాక్ టీం.. ఎన్నికల ఫలితాల తర్వాత చాప చుట్టేసింది. ఐప్యాక్ టీం పని తీరుపై వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఐ ప్యాక్ వల్లే ఓడిపోయామంటూ బహిరంగంగానే ప్రకటన చేశారు. పార్టీ నేతల నుంచి వస్తున్న వాదనలతో ఐప్యాక్ టీంను జగన్ కూడా వదిలించుకున్నారు.

పార్టీ బలోపేతం కోసం తాజాగా కొత్త వ్యూహకర్త కోసం వెతుకుతున్నారు జగన్. తమ వ్యూహాలతో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం దక్కేలా చేసిన సునీల్ కనుగోలు టీం కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.సునీల్ కనుగోలుకు మంచి ఆఫర్ చేసి వైసీపీ వ్యూహకర్తగా నియమించుకోవాలని చూస్తున్నారని టాక్. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సునీల్ కనుగోలుతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో డీకే ద్వారా సునీల్ తో జగన్ డీల్ చేసుకునే పనిలో ఉన్నారంటున్నారు. ఇటీవల ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు వైఎస్ జగన్. అక్కడి నుంచే డీకే శివకుమార్ ద్వారా జగన్ రాయబారాలు నడుపుతున్నారని అంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సునీల్ కు మంచి బంధం ఉంది. మరీ జగన్ కోసం సునీల్ పనిచేస్తే రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది చూడాలి మరీ..

Related Articles

Back to top button