ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ
Trending

కాలనీలో 225 విల్లాలకు నోటీసులు.. బడాబాబులకు చుక్కలు

హైడ్రా పరిధిలో అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టే దిశగా అధికారులు జెట్ స్పీడులో పరుగులు పెడుతున్నారు. మణికొండ చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. జీవో 658కి విరుద్దంగా 225 ROW హౌస్ల నిర్మాణాలు చేపట్టారని అధికారులు గుర్తించారు. జీ+1కు అనుమతులు పొంది జీ+2 నిర్మాణాలు చేపట్టారు.15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని సూచించారు మణికొండ మున్సిపల్ కమిషనర్. గత పాలకుల నిర్ణయాలతో చిత్రపురి సొసైటికి 50 కోట్ల రూపాయల నష్టం జరిగింది.

మరోవైపు హైడ్రాను బలోపేతం చేసే పనిలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్లాన్ చేస్తోంది. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయించింది. పీఎస్ స్టేటస్ తో హైడ్రానే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు కల్పించనుంది. ఒకటి, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడనున్నాయి. హైడ్రా కూల్చేసిన భవనాల అనుమతులపై విమర్శలు వస్తున్నాయి. పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే విషయంపై ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.

అక్రమ నిర్మాణాలను అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో అక్రమ నిర్మాణాలను అనుమతులు ఇచ్చిన అధికారులతో పాటు రూల్స్ కు విరుద్దంగా భవంతులు కట్టిన బడాబాబులు వణికిపోతున్నారు. హైడ్రా తమను టార్గెట్ చేస్తుందనే భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

Related Articles

Back to top button