HomeతెలంగాణGOOD NEWS: హైడ్రా (HYDRAA) భరోసా...!

GOOD NEWS: హైడ్రా (HYDRAA) భరోసా…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) కమిషనర్ ఏవీ రంగనాథ్ చెరువుల పునరుద్ధరణలో ఇళ్లు కోల్పోయిన పేదలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. చెరువులు, నాళాల ఆక్రమణల తొలగింపు సమయంలో ఇళ్లు కోల్పోయిన అసలైన నిరుపేదలకు ప్రభుత్వం తరపున డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

కేవలం ధనిక వర్గాలు, వ్యాపార ప్రయోజనాల కోసం నిర్మించిన అక్రమ కట్టడాలనే లక్ష్యంగా చేసుకుంటున్నామని, పేదల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని స్పష్టం చేశారు. మూసీ నది ప్రక్షాళన మరియు ఇతర చెరువుల పునరుద్ధరణలో భాగంగా నిరాశ్రయులైన వారికి తగిన పునరావాస సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు