Homeతెలంగాణత్రిపురారం లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ...!

త్రిపురారం లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ…!

క్రైమ్ మిర్రర్, త్రిపురారం ప్రతినిధి: నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కేంద్రంలో రైతు వేదిక ప్రాంగణంలో త్రిపురారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముడిమల్ల బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ జరిగింది. మాటూరు సర్పంచ్ ధానావత్ వెంకట్రాం నాయక్ అధ్యక్షతన మాటూరు గ్రామానికి చెందిన వాంకుడోతు శ్రావణి, వాంకుడోతు స్వాతి, వాంకుడోతు రేణుక, ధానావత్ స్వాతి, ధానావత్ అంజలి, వాంకుడోతు ఝాన్సీ లకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముడిమల్ల బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాస రెడ్డి, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అమరేందర్ రెడ్డి, నిడమానూరు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాటూరు సర్పంచ్ ధానావత్ వెంకట్రాం నాయక్, మండల ఆర్.ఐ సైదులు తదితరులు పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు