తెలంగాణరాజకీయం

ఏట్ల దుంకి సావు హరీష్..రెచ్చిపోయిన సీఎం రేవంత్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : రైతులకు 2 లక్షల రుణమాఫీని రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేసింది. ఇప్పటికే రెండు దఫాల్లో లక్షన్నర వరకు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్..ఖమ్మం జిల్లా వైరా వేదికగా మూడో దఫాలో రెండు లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీకి నిధులు ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆగస్టు 15లోపు రెండు లక్షల మేర ఉన్న రుణాలన్నింటిని మాఫీ చేస్తామని మాట ఇచ్చామని.. ఇచ్చిన మాట మేరకు రుణాలు మాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

తాను మాట ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన సవాలును రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే.. సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారని తెలిపారు. అయితే.. తాము ఇచ్చిన మాట మేరకు 2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేశామని.. చీమూ నెత్తురు ఉంటే హరీష్ రావు రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. “నీ మామ కేసీఆర్‌లాగే నీకు కూడా సిగ్గులేదనుకుంటే.. ఏట్ల దుంకి సావు..” అంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

“హరీష్ రావు.. ఛాలెంజ్ చేసినట్టుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి.. సిద్ధిపేటకు పట్టిన పీడ విరగడవుతుంది. నువ్వు ఎలాగూ రాజీనామా చేయవని నాకు తెలుసు కానీ. హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చిన ముక్కు నేలకు రాసి.. రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కాంగ్రెస్‌కు సవాల్ విసిరి తప్పు చేశానని ఒప్పుకుని.. రైతులకు క్షమాపణ చెప్పు. లేదంటే.. రాజీనామ చెయ్యి. సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా.” అంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Related Articles

Back to top button