-
గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత
-
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకటే టెన్షన్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఇటీవల తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు నారా లోకేష్. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్న ఆయనకు ప్రమోషన్ లభించింది. ఆయన ఒక్కరే కాదు.. చాలామంది యువ నేతలకు టిడిపి కార్యవర్గాల్లో స్థానం లభించింది. నారా లోకేష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నియామకాలు అన్నట్టు విశ్లేషణలు ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా నారా లోకేష్ పెద్దగా కనిపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆయన ఏదైనా విదేశాలకు వెళ్లారా? లేకుంటే సొంత రాష్ట్రంలోనే ఉన్నారా? ఎక్కడికి వెళ్లారు? స్థానికంగా ఉంటే అందుబాటులో ఎందుకు లేరు? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో ఆందోళనతో ఉంది.
తరచూ పర్యటనలు..
నారా లోకేష్ ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారు. అయితే రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చే క్రమంలో ఆయన తరచూ పర్యటనలు చేస్తుంటారు విదేశాలకు. మరోవైపు ఆయనకు క్రికెట్ అంటే ఇష్టం. అంతర్జాతీయ మ్యాచ్ ల సమయంలో.. మన దేశం ఆడే మ్యాచ్ ల కోసం ఆయన ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు దేశాలకు వెళుతుంటారు. అయితే ఈ పరిణామాల క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే పనిగా లోకేష్ పై విమర్శలు చేస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఖర్చుతో ఆయన పర్యటనలు అన్నట్టు ప్రచారం చేస్తూ ఉంటుంది. అయితే తన సొంత ఖర్చులతోనే లోకేష్ ఎక్కువగా క్రికెట్ మ్యాచ్లకు వెళుతుంటారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ ఎక్కడికి వెళ్లారు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అనుకూల మీడియాలో అయితే చిన్నబాబు ఎక్కడ అని కథనాలు ప్రచురిస్తున్నారు. అసలు లోకేష్ ఎక్కడ ఉన్నారు అన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న టెన్షన్.
ప్రత్యేక ప్రకటన లేదు..
సాధారణంగా క్యాబినెట్ మంత్రి విదేశాలకు వెళ్తే కచ్చితంగా ప్రభుత్వానికి సమాచారం ఇస్తారు. ఆపై మంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రకటన కూడా వస్తుంది. కానీ నారా లోకేష్ విషయంలో అటువంటిదేమీ లేకుండా పోయింది. అలాగని రాజకీయ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో లోకేష్ కనిపించడం లేదు. దీంతో అంతటా దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో అయితే ఆందోళన కనిపిస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక అడుగు ముందుకు వేసి లోకేష్ ఎక్కడ అని ప్రశ్నించి తనలో ఉన్న టెన్షన్ ను బయటపెట్టారు.