Homeక్రైమ్పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన వాహనం.. ఎస్‌ఐ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన వాహనం.. ఎస్‌ఐ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఖమ్మం జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకల నేపథ్యంలో విధులు ముగించుకుని తిరిగి వెళ్తున్న పోలీస్ సిబ్బందికి ప్రమాదం జరిగింది. తిరుమలాయపాలెం మండల పరిధిలో పోలీస్ వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టడంతో ఎస్‌ఐతో పాటు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.

తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ కూచిపూడి జగదీష్, డ్రైవర్‌తో కలిసి వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో విధులు నిర్వహించారు. అనంతరం పిండిప్రోలు గ్రామం నుంచి పోలీస్ స్టేషన్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఒక్కసారిగా పోలీస్ వాహనాన్ని ఢీకొట్టడంతో వాహనం తీవ్రంగా దెబ్బతిని నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఎస్‌ఐ జగదీష్‌తో పాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

also read: వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.. A1, A3లకు నోటీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు