ఆర్టీసీ విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. డీపీటీఓ కార్యాలయంలోని ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.
వర్మ గతంలో నెల్లూరు వీఎస్వో ధర్మతేజకు సంబంధించిన అవినీతి కేసులో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న సమయంలోనే గురువారం ఆయన ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. వర్మ ఆత్మహత్యకు ఖచ్చితమైన కారణాలు ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. పూర్తి వివరాలు అధికారిక విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన వాహనం.. ఎస్ఐ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
