Homeక్రైమ్UP Horror: అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్‌ లోకి చొరబడి.. ఇద్దరు అమ్మాయిలను.. యూపీలో ఘోరం!

UP Horror: అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్‌ లోకి చొరబడి.. ఇద్దరు అమ్మాయిలను.. యూపీలో ఘోరం!

ఉత్తర్‌ ప్రదేశ్‌ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్న కోపంతో ఓ యువకుడు ఇద్దరు యువతులపై దాడికి పాల్పడ్డాడు. హాస్టల్ గదిలోకి చొరబడి వారిని దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా బయటపడింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ప్రయాగ్‌ రాజ్‌ కు చెందిన శుభమ్ ద్వివేది అనే యువకుడి తండ్రికి శివ్‌కుతి ప్రాంతంలోని శంకర్ ఘాట్ వద్ద గర్ల్స్ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్‌లో ఉంటున్న ఇద్దరు అమ్మాయిలను శుభమ్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం, ఫోన్ కాల్స్ చేసి ఇబ్బంది పెట్టడం చేస్తున్నాడని బాధితులు తెలిపారు. వేధింపులు ఎక్కువ కావడంతో ఆ ఇద్దరు యువతులు శివ్‌కుతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా ఆరోపణలు నిజమని తేలింది. దీంతో శుభమ్‌ను అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్‌కు కారణమైన అమ్మాయిలపై అతడు తీవ్ర కోపం పెంచుకున్నాడు.

బెయిల్ పై బయటకు వచ్చి.. నేరుగా హాస్టల్ కు వెళ్లి!

మే 17న శుభమ్ బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. అదే రోజు రాత్రి మద్యం తాగి బాధిత యువతులకు ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేశాడు. వారు స్పందించకపోవడంతో ఆగ్రహంతో నేరుగా హాస్టల్‌కు వెళ్లాడు. రాత్రి రెండు గంటల సమయంలో అమ్మాయిల గది తలుపులు బలంగా కొట్టడం ప్రారంభించాడు. వారు భయంతో తలుపు తీయకపోవడంతో బయట నుంచి గడియ పెట్టేశాడు. గదిలో చిక్కుకుపోయిన యువతులు గట్టిగా అరవడం మొదలుపెట్టారు.కొంతసేపటి తర్వాత శుభమ్ తల్లి అక్కడికి చేరుకుంది. ఆమె రావడంతో తలుపు తెరిచిన శుభమ్ వెంటనే గదిలోకి వెళ్లి హంగామా సృష్టించాడు. ఇద్దరు యువతులపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హాస్టల్ దగ్గరికి చేరుకుని శుభమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు