Hometelanganaజర్నలిస్టుల సమస్యల సాధనకు టిడబ్ల్యూజెఎఫ్‌ కృషి...!

జర్నలిస్టుల సమస్యల సాధనకు టిడబ్ల్యూజెఎఫ్‌ కృషి…!

మిర్యాలగూడ క్రైమ్ మిర్రర్, జూన్‌ 10: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్‌ (టిడబ్ల్యూజెఎఫ్‌) నిరంతరం పోరాడుతూ ఫలితాలు సాధించిందని జిల్లా అధ్యక్షుడు ఎండి. అయూబ్‌ తెలిపారు. బుధవారం మిర్యాలగూడలోని ఎంపీజేఎఫ్‌ బీసీ భవన్‌లో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గతంలో మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన 86 మంది విలేఖరులకు ఇళ్ల స్థలాలు మంజూరయ్యేలా ఫెడరేషన్‌ కీలక పాత్ర పోషించిందన్నారు. స్థలాలు పొందిన జర్నలిస్టులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సహకారంతో ఇందిరమ్మ గృహాల మంజూరుకు కృషి చేస్తామని చెప్పారు.

Also Read:కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు పదవి…!

ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్‌ కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర స్థాయిలో ఫెడరేషన్‌ ఉద్యమిస్తోందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు జి. వెంకన్న పేర్కొన్నారు.

నియోజకవర్గ అధ్యక్షుడు మంద సైదులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు ఖాజా హమీదుద్దీన్‌, కేంద్ర కమిటీ సభ్యుడు గుండా మహేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు మనోజ్‌, జిల్లా కార్యదర్శి జి. జయరాజ్‌, నాగరాజు, దైద రవి, శివ, క్రాంతి, నల్లగాంతుల నాగభూషణం, రవికుమార్‌, అరుణ్‌కుమార్‌, మహేష్‌, రాంప్రసాద్‌, మచ్చ శ్రీనివాస్‌, ఉమామహేశ్వర్‌, బంటు సైదులు, నాగేందర్‌, సయ్యద్‌ నాసరుద్దీన్‌, రఫీయుద్దీన్‌, రఫిక్‌ ఖాన్‌తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Also Read:అంగన్వాడి టీచర్ వద్ద ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తులు.. ఎంపీడీఓ సమాధానంపై లబ్ధిదారుడి ఆగ్రహం

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు