Homeక్రైమ్రంగారెడ్డి జిల్లాలో విషాదం.. లిఫ్ట్ కింద పడి కార్మికుడు మృతి

రంగారెడ్డి జిల్లాలో విషాదం.. లిఫ్ట్ కింద పడి కార్మికుడు మృతి

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల సమీపంలోని ఓ పరిశ్రమలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్కాన్ ఐరన్ ఎనర్జీ పరిశ్రమలో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. గురువారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

కార్మికుడు పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్ కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? మృతుడి వివరాలు ఏమిటి? అనే అంశాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా, ఇదే పరిశ్రమలో గతంలోనూ పలుమార్లు ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై చర్చ మొదలైంది. తాజా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

also read: నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా వ్యాఖ్యల దుమారం.. విమర్శల మధ్య తన వైఖరికి కట్టుబాటు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు