Homeతెలంగాణమిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ కి కేటాయించాలి

మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ కి కేటాయించాలి

  • మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ కి కేటాయించాలి
  • మిర్యాలగూడ ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేత
  • బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిరుమలగిరి అశోక్

క్రైమ్ మిర్రర్, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళకు రిజర్వు అయినా సందర్భంగా బీసీ మహిళలకు కేటాయించాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిరుమలగిరి అశోక్ మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కి శనివారం మిర్యాలగూడ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో వినతి పత్రం అందచేశారు.

ఈ సందర్భంగా తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ.. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పీఠం నేటి వరకు బీసీలకు దక్కకపోవడం బాధాకరం మిర్యాలగూడ నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు సముచిత స్థానం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాబట్టి ఈసారి మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీలకు కేటాయించాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పోలగాని వెంకటేష్ గౌడ్, బోయపల్లి రవీందర్ గౌడ్, ఎర్రబెల్లి గంగాధర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు