Homeక్రైమ్మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్... ఇద్దరు యువకులు మృతి..!

మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్… ఇద్దరు యువకులు మృతి..!

  • హస్తినాపురంలో మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్..

  • కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి..

క్రైమ్ మిర్రర్, ఎల్ బి నగర్: హైదరాబాద్‌లోని హస్తినాపురం వద్ద ఓ వ్యక్తి మద్యం మత్తులో కారును నడిపి ఇద్దరు ప్రాణాలు తీశాడు. కారును అతివేగంగా, అడ్డగోలుగా నడుపుతూ ఓ ద్విచక్ర వాహనాన్ని, నడుచుకుంటూ వెళ్తున్న మరో యువకుడిని ఢీకొట్టాడు. వారిని 100 మీటర్లకు వరకు అలాగే కారుతో ఈడ్చుకెళ్లాడు. అనంతరం కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు, నడుచుకుంటూ వెళ్తున్న మరో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

బైక్‌‌పై వెళ్తున్న వారిని మహవీర్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన బీటెక్ విద్యార్థులు శివ, సందీప్‌గా గుర్తించారు. ప్రమాదం గురించి తెలిసిన మహవీర్ కాలేజీ విద్యార్థులు కారు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. డ్రైవర్‌ను తమకు అప్పగించాలని నినాదాలు చేశారు. కాగా, ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు