Homeతెలంగాణఆ రెండు పథకాలు వాయిదా...!

ఆ రెండు పథకాలు వాయిదా…!

  • సిద్దిపేట వేదికగా ఇందిరమ్మ బీమా పథకం

  • కోటి మంది చీరల పంపిణీ ఈనెల 26 కు వాయిదా

  • విడిగా కొత్త చేయూత పింఛన్ల పంపిణీ

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొత్త చేయూత పింఛన్ల జమను వాయిదా వేసింది. వాస్తవానికి గురువారం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ, చేయూత పెన్షన్ల విడుదల కార్యక్రమాన్ని సిద్దిపేట వేదికగా సీఎం రేవంత్ చేతుల మీదుగా నిర్వహించాలని చూసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇందిరమ్మ చీరల పంపిణీతోపాటు కొత్త చేయూత పింఛన్ల జమను విడిగా నిర్వహించాలని నిర్ణయించింది. అందుకే ఈనెల 26 కు వాయిదా వేసింది. ఆరోజు భారత రాజ్యాంగ దినోత్సవం. అదే రోజు కోటి మంది మహిళలకు చీరల పంపిణీ తో పాటు 4,63,857 మందికి చేయూత పెన్షన్ల నిధులను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది.

చీరల పంపిణీ…

ఇందిరమ్మ జయంతి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ అనేది జరుపుతూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఏడాది మహిళలకు చిలకపచ్చ చీరలను తయారు చేయించగా.. ఇప్పటికే అవి జిల్లాలకు చేరాయి. పింఛన్ పత్రాల పంపిణీ కూడా పూర్తయింది. ఈ రెండింటిని సిద్దిపేట వేదికగా సీఎం రేవంత్ ప్రారంభిస్తారని తొలిత నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఆ షెడ్యూల్ మార్చారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకానికి శ్రీకారం చుట్టింది. సిద్దిపేట వేదికగా ఈ కొత్త పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా నిధులకు సంబంధించిన పనులకు సైతం శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ.. పేద కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇచ్చే ఇందిరమ్మ బీమా పథకాన్ని రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది..

గేమ్ చేంజర్ గా…

వాస్తవానికి ఇందిరమ్మ బీమా పథకం గేమ్ చేంజర్ గా మారుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. గులాబీ పార్టీ అగ్రనేత హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నుంచి వ్యూహాత్మకంగా ప్రారంభిస్తుంది. కానీ ఇదే వేదికపై కోటి మంది మహిళలకు చీరల పంపిణీ, ఆపై చేయూత కొత్త పింఛన్లు అందిస్తారని అంత భావించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతోంది. ప్రతి సంక్షేమ పథకాన్ని విడివిడిగా ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది రేవంత్ సర్కార్. అందుకే కొత్త చీరల పంపిణీ ఈనెల 26 కు వాయిదా వేసింది. అదే సమయంలో కొత్త పింఛన్ల పంపిణీ వేదికను కూడా మార్చనుంది. మొత్తానికైతే ప్రభుత్వం గట్టి పట్టుదలతో ముందుకు వెళుతోందని అర్థం అవుతోంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య.. నలుగురిపై కేసు నమోదు
  2. పొదుపు మంత్రమే మనదేశ బలం.. తినడం, తాగడం, తిరగడం కాదు : ప్రధాని మోదీ
  3.  2027 వన్డే ప్రపంచకప్.. దిగ్గజ ఆటగాళ్లపై బీసీసీఐ పూర్తి భరోసా
  4.  ప్రేమ వివాహానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు