Wednesday, March 4, 2026
Homeక్రైమ్పోలీసులు ఫిర్యాదు పట్టించుకోలేదని...స్టేషన్ ఎదుటే వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పోలీసులు ఫిర్యాదు పట్టించుకోలేదని…స్టేషన్ ఎదుటే వ్యక్తి ఆత్మహత్యాయత్నం

తెలంగాణలోని జనగాం జిల్లా పాలకుర్తి మండలం తండా కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అసలు విషయానికి వస్తే తండా కు చెందిన శ్రీనివాస్ తన భార్య కాపురానికి రావడం లేదని పాలకుర్తి పోలీస్ స్టేషన్లో వారం క్రితం పిటిషన్ వేశాడు. అయితే దాని తర్వాత పోలీసులు తన పిటిషన్ పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ కోపంతో పోలీస్ స్టేషన్ ముందే తన శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్నాడు.

ఇక వెంటనే శ్రీనివాస్ ను స్టేషన్ ఎస్ఐ సాయి ప్రసన్నకుమార్ అలాగే కానిస్టేబుల్ రవీంద్రా అతనిపై ఉన్నటువంటి మంటలను ఆపడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే ఎస్ఐకి అలాగే కానిస్టేబుల్ కి కూడా గాయాలయ్యాయి. అయినా సరే లెక్కచేయకుండా శ్రీనివాసుని కాపాడి మెరుగైన చికిత్స కోసం సిటీలోని ఎంజీఎం కు తరలించారు. ఈ విషయం ఇప్పుడు జనగామ జిల్లా వ్యాప్తంగా తెగ వైరల్ అయిపోతుంది. ఈ సమాచారాన్ని పోలీసులు అతని కుటుంబ సభ్యులకి అందజేశారు.

Read More : ముత్యాలమ్మ గుడికి వెళ్లకుండా ఈటల రాజేందర్ హౌజ్ అరెస్ట్

RELATED ARTICLES

Most Popular

Recent Comments