హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతుల (రిపేర్)పై రాష్ర్ట ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు Col. పరిచిత్ మెహ్రా ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఇంజినీర్లు, నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. మూడు బ్యారేజీల మరమ్మతులకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది
మే 30లోగా పరిశీలనలు…
రుతుపవనాలకు ముందే జియో టెక్నికల్ పరిశీలనలు పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ సూచించింది. మే 30వ తేదీలోగా పరిశీలనలు పూర్తిచేయాలని డెడ్‌లైన్ విధించింది. రోజువారీ పురోగతి నివేదికలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. సీడబ్ల్యూసీ ఎన్డీఎస్ఏ అనుమతులతో పనులు, డిజైనింగ్ పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. రోజువారీ యాక్షన్ ప్లాన్‌తో పనులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.
