HomeజాతీయంParliament: పార్లమెంట్ లో మార్మోగిన తెలంగాణ!

Parliament: పార్లమెంట్ లో మార్మోగిన తెలంగాణ!

* ఏపీ విభజనను తప్పు పట్టిన బిజెపి ఎంపీ తేజస్వి

* కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో సంచలన కామెంట్స్

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. డి లిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఆమోదంతో పాటు చర్చ జరిపేందుకు మూడు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే డి లిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో కేంద్రం స్పందించింది. ఎవరికి అన్యాయం జరగదని హామీ ఇచ్చే ప్రయత్నాలు చేసింది. ఇలాంటి సమయంలో బిజెపి ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని తిట్టే క్రమంలో ఆయన తెలంగాణ ప్రస్తావన తెచ్చారు. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీసిన తీరు దారుణంగా ఉందని కామెంట్ చేశారు. ఇప్పుడు ఇది అటు తిరిగి ఇటు తిరిగి తెలంగాణ వివాదానికి కారణం అవుతోంది.

యూపీఏ 2 హయాంలో..

యూపీఏ 2 అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ విభజన జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో పార్లమెంట్లో జరిగిన వివాదం సర్వత్ర ఆందోళన వ్యక్తం అయింది. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ బిల్లును అప్పటి కాంగ్రెస్ ఏపీ ఎంపీలు సైతం విపరీతంగా వ్యతిరేకించారు. పార్లమెంట్ తలుపులు మూసి ఈ బిల్లును ఆమోదించినట్లు విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు డి లిమిటేషన్ బిల్లు విషయంలో అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకత రావడంతో బిజెపి ఎంపీ తేజస్వి సూర్య ఫైరయ్యారు. అప్పట్లో తెలంగాణ విభజన సమయంలో కనీస శాస్త్రీయ ప్రమాణాలు పాటించలేదని మండిపడ్డారు. బ్రిటిష్ వారు చేసిన దేశ విభజన కంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ఏపీ విభజన దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా తెలంగాణను పాకిస్తాన్ లా విడదీశారు అంటూ కామెంట్ చేశారు

కాంగ్రెస్ తీరుపై చర్చ..

అయితే మరోసారి ఏపీ విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అడ్డంగా బుక్ అయినట్లు అయింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను, భవిష్యత్తును రాష్ట్ర విభజన సందర్భంగా అస్సలు పట్టించుకోలేదని లోక్సభలో గట్టిగానే చెప్పుకొచ్చారు తేజస్వి సూర్య. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేశారని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. అప్పట్లో ఈ విభజనను పార్లమెంటులో బిజెపి కూడా మద్దతు ఇచ్చిన విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు. అయితే తెలంగాణ విభజన జరిగి 12 ఏళ్లు దాటి పోతున్న ఇంకా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కాంగ్రెస్ పార్టీని విమర్శించే క్రమంలో పాకిస్తాన్ తో పోల్చడం మాత్రం సంచలనంగా మారింది. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.. సభలో కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ రెండు బిల్లులు ఇప్పుడు బిజెపి వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు పరిస్థితి మారింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు