
భారతదేశంలో మద్యం వినియోగంపై ఇటీవల వెలువడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6) నివేదికలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఈ తాజా నివేదిక ప్రకారం, దేశంలోనే అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గమనిస్తే, ప్రతి ఇద్దరు వయోజనులలో ఒకరు మద్యం సేవిస్తున్నట్లు ఈ సర్వే స్పష్టం చేసింది.ముఖ్యంగా 15 ఏళ్లు పైబడిన పురుషులలో ఏకంగా 43.9 శాతం మంది మద్యం తాగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది జాతీయ సగటుతో పోలిస్తే రెట్టింపు కంటే అధికంగా ఉండటం గమనార్హం. జాతీయ స్థాయిలో మద్యం సేవించే వారి సగటు కేవలం 18.9 శాతంగా మాత్రమే ఉంది.
ఈ సర్వేలో వెల్లడైన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తెలంగాణలో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే మద్యం వినియోగం అధికంగా ఉంది. పట్టణాల్లో 36.3 శాతం మంది మద్యం సేవిస్తుండగా, పల్లెల్లో ఆ సంఖ్య 46.6 శాతంగా నమోదైంది. దీన్నిబట్టి గ్రామీణ ప్రజల్లో ఈ అలవాటు మరింత ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది.తెలంగాణ తర్వాతి స్థానాల్లో ఇతర రాష్ట్రాల పరిస్థితిని పరిశీలిస్తే.. రాజస్థాన్ 42.2 శాతం మద్యం వినియోగంతో రెండవ స్థానంలో నిలవగా, ఛత్తీస్గఢ్ 38.3 శాతంతో మూడవ స్థానంలో నిలిచాయి.
‘చుట్టమల్లే’ ఏఐ వివాదం: సెలబ్రిటీల అత్యుత్సాహం కూడా నేరమేనంటూ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!