Homeతెలంగాణతెలంగాణ అకడమిక్ గ్రంథాలయాల్లో ఐసీటీ అప్లికేషన్స్ పై నూతన గ్రంథం విడుదల

తెలంగాణ అకడమిక్ గ్రంథాలయాల్లో ఐసీటీ అప్లికేషన్స్ పై నూతన గ్రంథం విడుదల

క్రైమ్ మిర్రర్, నల్లగొండ బ్యూరో: డాక్టర్ సుంకరి రాజారామ్, డాక్టర్ చేగోని రవికుమార్ సంయుక్తంగా రచించిన “ICT APPLICATIONS IN ACADEMIC LIBRARIES OF TELANGANA” అనే నూతన గ్రంథాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ లో ఈ కార్యక్రమం జరిగింది.

విద్యారంగంలో సమాచార సాంకేతికత వినియోగం ఎంతో కీలకం

ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యారంగంలో సమాచార సాంకేతికత వినియోగం ఎంతో కీలకమన్నారు. తెలంగాణలోని అకడమిక్ లైబ్రరీల అభివృద్ధికి ఈ పుస్తకం దోహదపడుతుందని అన్నారు. డిజిటల్ యుగంలో లైబ్రరీలు ఆధునీకరణకు ఇది మార్గదర్శిగా ఉంటుందన్నారు.

రచయితలు ఏం చెప్పారంటే?

రచయితలు డాక్టర్ సుంకరి రాజారామ్ ( ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ ), డాక్టర్ చేగోని రవికుమార్ మాట్లాడుతూ, తెలంగాణలోని అకడమిక్ లైబ్రరీల్లో ఐసీటీ వినియోగం, సవాళ్లు, అవకాశాలను ఈ పుస్తకంలో వివరంగా చర్చించామని తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు, లైబ్రేరియన్లకు ఇది ఉపయోగపడే సూచనా గ్రంథంగా రూపొందించినట్లు వివరించారు. శాసనమండలి కార్యదర్శి డాక్టర్ వి. నరసింహచార్యులు ఈ పుస్తకాన్ని రచించిన డాక్టర్ సుంకరి రాజారామ్, డాక్టర్ చేగోని రవికుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యారంగ ప్రముఖులు, లైబ్రేరియన్లు, పరిశోధకులు పాల్గొన్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు