Homeతెలంగాణనిరుద్యోగంలో తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌...!

నిరుద్యోగంలో తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌…!

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్ : ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఆందోళనకరంగా మారింది. ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ బజాజ్ బ్రోకింగ్, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ‘ఇండియన్ ఎకనామిక్ సర్వే 2025-26’ ఆధారంగా ఒక నివేదికను వెల్లడించింది. దీని ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో నిరుద్యోగిత రేటు 8.9 శాతానికి చేరుకొని దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.దేశ సగటు నిరుద్యోగిత రేటు 5.2 శాతంగా ఉండగా, తెలంగాణలో అది అంతకంటే 3.7 శాతం ఎక్కువగా ఉంది.

ఏపీ (8.2%), కర్ణాటక (8.0%) వంటి పొరుగు రాష్ట్రాల కంటే కూడా తెలంగాణలో నిరుద్యోగం అధికంగా నమోదైంది.2022లో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ నిరుద్యోగిత రేటు కేవలం 0.7 శాతంగా ఉండేదని, అప్పట్లో ఉపాధి కల్పనలో రాష్ట్రం దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని నివేదిక గుర్తు చేస్తోందిగత ప్రభుత్వ హయాంలో నెలకు సగటున 2,037 ఉద్యోగ నియామకాలు జరగగా, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గత రెండున్నరేళ్లలో ఆ వేగం తగ్గి నెలకు సగటున 566 నియామకాలకు పరిమితమైందని గణాంకాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా, ప్రైవేట్ రంగంలోనూ ఆశించిన స్థాయిలో కొత్త అవకాశాలు రాకపోవడం, ఉన్న ఉద్యోగాల్లో కోతలు నిరుద్యోగులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఆశించిన స్థాయిలో రాకపోవడం , జాబ్ క్యాలెండర్ అమలులో జాప్యం కారణంగానే రాష్ట్రంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు