Homeక్రైమ్హైదరాబాద్‌లో విషాదం: రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట దంపతులు మృతి..!

హైదరాబాద్‌లో విషాదం: రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట దంపతులు మృతి..!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: కుటుంబంతో కలిసి ట్యాంక్ బండ్‌ చూడడానికి వెళ్తున్న వారిని ఆర్టీసీ (TGSRTC) బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. వారిని బస్సు వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది.బస్సు వెనుక టైర్లు వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.
వివరాల్లోకి వెళితే…సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు మరియు వెంకటమ్మ దంపతులు. వీరు కొత్తపేటలోని తమ కుమార్తె ఇంటికి వచ్చి, కుటుంబంతో కలిసి ట్యాంక్ బండ్‌కు వెళ్తుండగా హైదరాబాద్‌లోని ముసారాంబాగ్ (మలక్‌పేట్) వద్ద 2026, జనవరి 1 (గురువారం) రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులు దుర్మరణం పాలయ్యారు.
వీరు ప్రయాణిస్తున్న స్కూటీని ముసారాంబాగ్ సమీపంలో దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ (TGSRTC) బస్సు వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో దంపతులు కింద పడిపోగా, బస్సు వెనుక టైర్లు వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. మలక్‌పేట్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా/గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు