క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- దేశవ్యాప్తంగా వేసవి సెలవులు ప్రారంభం అయ్యాయి. వివిధ పాఠశాలలకు అలాగే ఆయా ప్రభుత్వ సంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడంతో తిరుమల లో భక్తుల రద్దీ అమంతంగా పెరిగింది. గత మూడు రోజుల క్రితం రద్దీ ఒకలా ఉండగా.. రెండు రోజుల నుంచి తిరుమలలో రద్దీ రెట్టింపు పెరిగింది. ప్రస్తుతం టోకెన్ లేనటువంటి వారికి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి దాదాపు 15 గంటల సమయం పడుతుంది అని అధికారులు తెలిపారు. కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండిపోవడంతో శిలా తోరణం వరకు కూడా భక్తులు వేచి ఉన్నారు. వేసవికాలం కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయా ఆహార పదార్థాలను అందిస్తున్నారు. కేవలం నిన్న ఒక్కరోజులోనే 80350 మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగా అందులో 36,590 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. వీటన్నిటితో పాటుగా ఒక్కరోజులోనే స్వామి వారి హుండీ ఆదాయం 3.27 కోట్లు వచ్చినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ఇప్పటినుండి దాదాపు రెండు నెలల పాటు వేసవికాలం ఉండడంతో మరింత మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున భక్తుడు తరలివచ్చే అవకాశాలు ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
S.A. Dharmadhikari: లా విద్యలో మనుస్మృతి, బుద్ధిజం బోధించాలి.. మద్రాస్ హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు!
Electricity Demand: ఎండల ఎఫెక్ట్.. దేశంలో ఆల్‌టైమ్ హైకి విద్యుత్ డిమాండ్!