Homeతెలంగాణరేపటి నుండి పెరగనున్న భూముల విలువ - రిజిస్ట్రేషన్లు...!

రేపటి నుండి పెరగనున్న భూముల విలువ – రిజిస్ట్రేషన్లు…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ పెరగనున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్న భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 12 నుండి 15 వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పని చేస్తాయి.

డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల కోసం రోజు వారీ కేటాయించే స్లాట్ల సంఖ్యను కూడా పెంచారు. దీనివల్ల ఎక్కువ మందికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అవసరమైతే ఈ ప్రత్యేక డ్రైవ్ సమయంలో సెలవు రోజుల్లో కూడా కార్యాలయాలు పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. భూముల విలువల పెంపు అమల్లోకి రాకముందే తమ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని ప్రజలు ప్రయత్నిస్తుండటంతో ఈ రద్దీ ఏర్పడింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు