Friday, March 6, 2026
Homeతెలంగాణక్యాతనపల్లి ఓట్ల లెక్కింపుకు పటిష్ట బందోబస్తు: ఏసిపి రవికుమార్

క్యాతనపల్లి ఓట్ల లెక్కింపుకు పటిష్ట బందోబస్తు: ఏసిపి రవికుమార్

రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:-క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. గురువారం జరగనున్న కౌంటింగ్ నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌.కె సీఓఏ క్లబ్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రం వద్ద వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ అనుమతి ఉన్న వ్యక్తులకే ప్రవేశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బలగాలను మొహరించామని పేర్కొన్నారు.

విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది ఉదయం 5 గంటలకే హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మధ్యాహ్నం వరకు ఓట్ల లెక్కింపు పూర్తయ్య అవకాశం ఉందన్నారు కౌంటింగ్ హాల్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనంతరం ఏసిపి రవికుమార్, గోదావరిఖని ఏఆర్ ఏసీపీ ప్రతాప్ కలిసి కౌంటింగ్ హాల్‌ను పరిశీలించి, స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో మందమర్రి సీఐ రమేష్, రామకృష్ణాపూర్ ఎస్‌ఐ శ్రీధర్, మందమర్రి డివిజన్ పరిధిలోని ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అయ్యో తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా

వినూత్న ఆలోచన.. వార్డు సభ్యులకు శాఖలను కేటాయించిన సర్పంచ్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments