Homeఆంధ్ర ప్రదేశ్అమరావతిలో తెలంగాణ మహనీయుల విగ్రహాలు!

అమరావతిలో తెలంగాణ మహనీయుల విగ్రహాలు!

•స్థలం కేటాయించాలని కోరుతున్న తెలంగాణ నాయకులు
•ఏపీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో
:-
హైదరాబాదులో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే దీని తర్వాత ఏపీలో తెలంగాణ నేతల విగ్రహాలు పెట్టాలని డిమాండ్లు ప్రారంభం అయ్యాయి. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహంతో పాటు దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక తెలుగు నేత పివి నరసింహారావు విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు తెలంగాణ నేతలు. కాళోజి, దాశరధి, సి నారాయణరెడ్డి వంటి తెలంగాణ రచయితల విగ్రహాలు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది.

* ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణతో..
హైదరాబాద్ లోని అమీర్పేట మైత్రివనంలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు తెలంగాణ నేతలు ఇప్పుడు అమరావతిలో సైతం తెలంగాణ ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాజాగా బిజెపి తెలంగాణ అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నందమూరి తారక రామారావు, ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాలు హైదరాబాదులో ఏర్పాటు అయ్యాయని.. ఇదే స్ఫూర్తితో ఏపీలో కూడా స్థలం కేటాయిస్తే తెలంగాణ వైతాళికుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య మరోసారి సెంటిమెంటును రగిలించి రాజకీయం చేయాలనుకుంటున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు. అందుకే వారికి అవకాశం ఇవ్వకుండా.. మరోసారి ప్రజల మధ్య విభజన రేఖ రాకుండా ఈ విగ్రహాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

* అమరావతిలో ప్రముఖుల విగ్రహాల సరసన..
ఇప్పటికే అమరావతి రాజధానిలో మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం నడుం బిగించింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. నందమూరి తారక రామారావు తో పాటు ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయించింది. గతంలో పీవీ నరసింహారావు విషయంలో తెలుగుదేశం సానుకూల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ దేశ ప్రధానిగా అవకాశం దక్కించుకున్న ఆయనను ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నుకుంది. తప్పకుండా తెలంగాణ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు పీవీ నరసింహారావు విగ్రహానికి కచ్చితంగా స్థలం కేటాయించే అవకాశం ఉంది. ఆపై సి నారాయణరెడ్డి, దాశరధి, కాళోజి, తెలంగాణ నటుడు కాంతారావు, భాగవతాన్ని తెలుగులో రచించిన బమ్మెర పోతన విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ నేతలు ముందుకు వస్తున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు