
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ 2026 లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు అభిమానులకు ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపిఎల్ ట్రోఫీని గెలిచింది. ఈ సందర్భంలో RCB అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. ఆ తరువాత స్టేడియం లో నిర్వహించిన ట్రోఫీ సెర్మనీ కార్యక్రమంలో భాగంగా తొక్కిసలాట జరగగా ఎంతోమంది మరణించారు. ఈ నేపథ్యంలోనే RCB సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వచ్చే సంవత్సరం హోమ్ మ్యాచ్ లు చిన్నస్వామి స్టేడియంలో ఆడకూడదని నిర్ణయించుకుంది. ఈ స్టేడియానికి బదులుగా మహారాష్ట్రలోని పుణే స్టేడియాన్ని బెంగళూరు యాజమాన్యం ఎంచుకున్నట్లుగా క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఒకవేళ ఇదే నిజమైతే కచ్చితంగా RCB తమ హోమ్ మ్యాచులను హోం గ్రౌండ్ లో ఆడక పోవడం ఇదే తొలిసారి అవుతుంది. RCB యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సొంత టీం అభిమానులకు నిరాశ మిగులుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా దేశంలోని అన్ని స్టేడియాలకన్నా చిన్న స్వామి స్టేడియం చాలా చిన్నది కాబట్టి.. మరోవైపు ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్లు జట్టులో ఉండడంతో తొక్కిసలాట లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహుశా ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాలనే RCB యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఆర్సిబి జట్టును వేరే ఎవరో కొనుగోలు చేయబోతున్నట్లుగా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చాలానే వార్తలు వస్తున్నాయి.
Read also : రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న వైసీపీ?
Read also : బ్యాంక్ కు లంచ్ బ్రేక్ అనేది ఉండదు.. ప్రజలు గమనించాలి!





