Homeక్రైమ్దారుణం...భార్య చేతిలో భర్త హతం...! ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం...

దారుణం…భార్య చేతిలో భర్త హతం…! ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం…

మహబూబాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: కుటుంబ కలహాలు ఒకరి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. క్షణికావేశంలో కట్టుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. గూడూరు మండలం సోమ్లా తండాలో ఈ దారుణ సంఘటన వెలుగుచూసింది. సోమ్లా తండాకు చెందిన బోడ లాలు, విజయ దంపతుల మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. భర్త లాలు ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో కార్ డ్రైవర్గా పని చేస్తూ, వారానికి ఒకసారి ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే తండాలో జరిగిన ఒక వివాహ శుభకార్యానికి హాజరయ్యేందుకు లాలు గ్రామానికి వచ్చాడు. అయితే, అర్ధరాత్రి సమయంలో లాలు మద్యం తాగి ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య మళ్లీ తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఈ ఘర్షణలో కోపోద్రేకురాలైన భార్య విజయ.. ఇంట్లో ఉన్న బండరాయితో భర్త లాలు తలపై బలంగా బాదింది.

Also Read:ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలి? ‘స్లీప్ ఫౌండేషన్’ కీలక నివేదిక!

దీంతో తలకు తీవ్ర గాయాలై లాలు అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచాడు. భర్త చనిపోయాడని గ్రహించిన విజయ.. నేరుగా స్థానిక గూడూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లోంగిపోయి, జరిగిన విషయాన్ని వివరించింది. సమాచారం అందుకున్న గూడూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడు లాలుకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. , ఘటనలో తండ్రి మరణించి, తల్లి జైలు పాలవడంతో ఆ పిల్లలు అనాథలుగా మారారు. కట్టుకున్న భర్త శవమై పడి ఉండటంతో సోమ్లా తండాలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read:యువతను కాంగ్రెస్ నిలువునా ముంచింది: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు