Homeక్రైమ్దారుణం....అక్కను వేధిస్తున్నాడని బావపై క‌త్తుల‌తో దాడి చేసి హ‌త్యా...!

దారుణం….అక్కను వేధిస్తున్నాడని బావపై క‌త్తుల‌తో దాడి చేసి హ‌త్యా…!

హైదరాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్‌: అక్కను తరచూ వేధిస్తున్నాడని బావను బావమరిది హతమార్చాడు. గోల్కొండలోని పతేదర్వాజా ప్రాంతానికి చెందిన రుక్సానా అనే మహిళను పాతబస్తీకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చాంది మసూద్ పెళ్లి చేసుకున్నాడు. అయితే రుక్సానా భర్త తరచూ తనతో గొడవ పడుతున్నాడని పుట్టింటికి వచ్చింది.

Also Read:రమేష్ కుటుంబానికి అండగా కాంగ్రెస్ నాయకులు – రూ.10 వేల ఆర్థిక సహాయం..! 

పుట్టింటికి వెళ్లి మరోసారి రుక్సానాతో గొడవ పడుతుండగా, తన అక్కను తరచూ వేధిస్తున్నాడని బావపై బావమరిది సోయల్ తిరగబడ్డాడు. అదే కోపంలో తన స్నేహితులు జాబేర్, అప్పుతో కలిసి చాంది మసూద్ ను కత్తులతో విచక్షణారహితంగా హతమార్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also Read:ఇలాంటి స్నేహితులతో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని స్నేహితుని దారుణ హత్య!!

తాజావార్తలు