Homeజాతీయంప్రభుత్వ టీచర్లకు షాక్: కోచింగ్ సెంటర్లలో పనిచేసినా, ట్యూషన్లు చెప్పినా వేటు!

ప్రభుత్వ టీచర్లకు షాక్: కోచింగ్ సెంటర్లలో పనిచేసినా, ట్యూషన్లు చెప్పినా వేటు!

క్రైమ్ మిర్రర్, జాతీయం:- బీహార్ ప్రభుత్వం విద్యావ్యవస్థలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో పనిచేయడం, లేదా ఇంటి వద్ద ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.బీహార్ విద్యాశాఖ మంత్రి ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. ఉపాధ్యాయుల పనితీరును మెరుగుపరచడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. నిబంధనలను ఉల్లంఘించి ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసినా, ట్యూషన్లు చెప్పినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.నిబంధనలు అతిక్రమించిన వారిపై తీసుకునే చర్యల్లో భాగంగా, వారి జీతం నిలిపివేయడంతో పాటు సస్పెన్షన్ వంటి కఠిన చర్యలకు కూడా ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తమ పూర్తి సమయాన్ని, దృష్టిని విద్యార్థుల అభ్యసనపైనే కేంద్రీకరిస్తారని ప్రభుత్వం భావిస్తోంది.

అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!

డబ్బులు ముద్రించే మిషన్‌లా మారిన ఫిఫా వరల్డ్ కప్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు