Homeక్రైమ్బ్లూ ఫిల్మ్ లో నటిస్తే రూ.10 లక్షలు ఇస్తాం..!

బ్లూ ఫిల్మ్ లో నటిస్తే రూ.10 లక్షలు ఇస్తాం..!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: అమాయక ప్రజల ఆర్థిక ఇబ్బందులను, అవసరాలను ఆసరాగా చేసుకుని నేరగాళ్లు విసిరే వలలు సామాన్యుల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ మహిళ అవసరాలను ఆసరాగా చేసుకున్న ఓ ముఠా ఆమెకు నీలి చిత్రాల పేరు చెప్పి దారుణంగా మోసం చేసిన ఘటన హైదరాబాద్ లోని నగరంలో కలకలం రేపింది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. నీలి చిత్రాలలో నటిస్తే రూ.10 లక్షలు ఇస్తామంటూ అంటూ కొందరు వ్యక్తులు ఒక వివాహితకు ఆఫర్ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సదరు మహిళ వారు చెప్పిన మాటలు నమ్మింది. బ్లూ ఫిల్మ్ చిత్రీకరిస్తామంటూ ఆ మహిళను ఒక హోటల్ గదికి తీసుకెళ్లిన దుండగులు, షూటింగ్ పేరుతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆమెకు ఇస్తానన్న డబ్బు ఇవ్వకుండా అక్కడి నుంచి పరారయ్యారు. దాంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి యూసఫ్‌గూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు.

నిందితులు ఎవరు ? దీని వెనుక ఏదైనా పెద్ద ముఠా ఉందా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు, అపరిచితులు ఇచ్చే భారీ ఆఫర్ల వెనుక పెద్ద ప్రమాదాలు పొంచి ఉంటాయని, ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు