
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకుల అందరిని కూడా మెప్పించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు కూడా ఫ్యామిలీ అందరూ కూడా కలిసి కూర్చొని చూసిన సినిమా ఇది. అయితే ఇటువంటి క్లాసిక్ మూవీ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మరోసారి థియేటర్లలో ఇవాళ రిలీజ్ అయింది. దీంతో థియేటర్ల వద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు విక్టరీ వెంకటేష్ అభిమానులు అందరూ కూడా తెగ సందడి చేస్తున్నారు.
టీడీపీ-జనసేన మధ్య గ్యాప్ వస్తోందా..? – అందుకు కారణం నాగబాబేనా..!
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికి కూడా ప్రేక్షకులను మైమరిపిస్తుంది. ఇప్పటికీ ఈ చిత్రం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ప్రేక్షకులకు ఫేవరెట్ మూవీ గా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఈ సినిమా చూసిన ఎవరూ కూడా భవిష్యత్తులో మర్చిపోరని ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ ను అందుకుంది. కాగా ఈ సినిమాలో వెంకటేష్ మరియు మహేష్ బాబు లతో పాటుగా హీరోయిన్ సమంత, అంజలి నటించారు. కాగా మరో ఏడాది లేదా రెండు సంవత్సరాలలో ఈ సినిమాకి సీక్వెల్ తీసేందుకు నిర్మాత దిల్ రాజు కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం అందింది. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు వాళ్ల నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మైమరిపించింది.
అద్దంకి దయాకర్‌కు మళ్లీ షాక్.. ఎమ్మెల్సీ రేసులో జానారెడ్డి అనుచరుడు?