-
నిధులను సమీకరించిన తెలంగాణ ప్రభుత్వం …
-
ఈనెల చివరిలో మూడో విడత …
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలపై స్పష్టత వచ్చింది. ముందుగా నిర్ణయించిన తేదీలో స్వల్ప మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత తొలి విడత నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో విడత కోసం నిధులు సమీకరిస్తోంది. నిధుల విడుదలకు సంబంధించి ముహూర్తం ఖరారు చేసింది. అయితే రెండో విడత నిధులకు సంబంధించి ఎవరికి జమ కానున్నాయి అనేది స్పష్టత వస్తుంది. ఈ నెలలోనే మూడో విడత నిధులు కూడా పూర్తిగా జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ హామీ…
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా పథకం కింద సాగు సాయం అందిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మూడు విడతల్లో నిధుల జమకు నిర్ణయించారు. ఇప్పటికే మొదటి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. రెండో విడత కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. యాసంగి పంటలు చేతికొచ్చే సమయం దగ్గర పడుతుండడంతో సాధ్యమైనంత త్వరగా ఈ నెలలోనే పంపిణీ పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉంది తెలంగాణ సర్కార్.
ఇప్పటికే దీనిపై స్పష్టమైన ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. మొదటి విడత నిధులను గత నెల 23న రైతుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 68,89,955 మంది రైతులకు ఎకరం లోపు వరకు సొమ్మును అందించింది ప్రభుత్వం. 57,44,907 ఎకరాలకు సంబంధించి రూ.3446 కోట్లు జమ చేసింది. అయితే రెండో విడత నిధులకు సంబంధించి ఈ నెల 22 లోగా విడుదల చేస్తామని చెప్పింది. అన్నట్టుగానే 20న నిధుల విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. మూడో విడత నిధులు సైతం ఈ నెల చివరిలోగా వేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అందుకు సంబంధించి నిధులను కూడా సమీకరిస్తుంది.
నిధులు సిద్ధం…
తెలంగాణ ప్రభుత్వానికి వివిధ శాఖల రూపంలో ఆదాయం సమకూరుతోంది. మరోవైపు రుణ సమీకరణ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 7న ఒకేసారి రూ.3900 కోట్లు రుణం తీసుకుంది. ఈ నెల 21న మరో 3 వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకోనుంది . ఇలా ఖజానాలో 6900 కోట్ల రూపాయల వరకు సిద్ధంగా ఉంటాయని తెలుస్తోంది. వాటి నుంచే రెండో విడత రైతు భరోసా నిధుల మళ్లింపు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ రెండో విడతకు సంబంధించి ఐదు ఎకరాల వరకు సొమ్ము జమ చేయవచ్చు అనేది సమాచారం. ఇందుకు మూడు వేల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు అవసరం అవుతాయని అంచనా. మొత్తానికి అయితే రైతు భరోసా పథకానికి రూ.9000 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు తగ్గట్టు నిధుల సమీకరణ వేటలో ఉంది ప్రభుత్వం.
