HomeజాతీయంRajesh Exports Case: రూ.15 లక్షల కోట్ల స్కామ్.. రాజేశ్ ఎక్స్‌ పోర్ట్స్‌ అధినేతపై సెబీ...

Rajesh Exports Case: రూ.15 లక్షల కోట్ల స్కామ్.. రాజేశ్ ఎక్స్‌ పోర్ట్స్‌ అధినేతపై సెబీ నిషేధం!

బంగారం రిఫైనింగ్, ఆభరణాల తయారీ సంస్థ రాజేశ్ ఎక్స్‌ పోర్ట్స్‌ పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షాకింగ్ కామెంట్స్ చేసింది. గత ఐదేళ్లలో కంపెనీ తన ఆదాయాలను రూ.15 లక్షల కోట్లకు పైగా ఎక్కువగా చూపించిందని వెల్లడించింది. ముఖ్యంగా విదేశీ అనుబంధ సంస్థల ద్వారా భారీ ఆదాయం చూపించినట్లు తెలిపింది.

తక్కువ ఆదాయాన్ని ఎక్కువగా చూపించి..

సెబీ వివరాల ప్రకారం, స్విట్జర్లాండ్‌కు చెందిన వాల్కంబి ఎస్‌ఏ అనే అనుబంధ సంస్థలో నిజంగా ఉన్న ఆదాయం చాలా తక్కువగా ఉండగా, రాజేశ్ ఎక్స్‌ పోర్ట్స్ మాత్రం దాన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయంగా చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2020-21 నుంచి 2024-25 మధ్య కంపెనీ రూ.15.18 లక్షల కోట్ల కన్సాలిడేట్ ఇన్ కమ్ చూపించగా, అందులో 99 శాతం కంటే ఎక్కువ భాగం అనుబంధ సంస్థలదేనని పేర్కొంది.

అయితే, వాల్కంబి స్టాండలోన్ ఆర్థిక లెక్కల్లో కేవలం ప్రాసెసింగ్ ఛార్జీలు మాత్రమే ఆదాయంగా నమోదు అయినట్లు సెబీ తెలిపింది. ఉదాహరణకు 2023లో వాల్కంబి ఆదాయం రూ.543 కోట్లుగా ఉండగా, అదే సమయంలో రాజేశ్ ఎక్స్‌ పోర్ట్స్ గ్రూప్ రూ.2 లక్షల కోట్లకు పైగా ఆదాయంగా చూపినట్లు వివరించింది. ఈ భారీ వ్యత్యాసంపై సెబీ ప్రశ్నలు లేవనెత్తింది.

రాజేశ్ మెహతాపై సెబీ నిషేధం

అంతేకాకుండా, కంపెనీ సరైన డాక్యుమెంట్లు, అంతర్ కంపెనీ ఒప్పందాలు, అకౌంటింగ్ ఆధారాలు సమర్పించడంలో విఫలమైందని సెబీ పేర్కొంది. దీంతో కంపెనీ ప్రమోటర్, ఛైర్మన్ మరియు సీఈఓ రాజేశ్ మెహతాపై సెక్యూరిటీస్ మార్కెట్లో కార్యకలాపాలు చేయకుండా నిషేధం విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కంపెనీ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. 2023లో రూ.1,028 స్థాయికి చేరిన షేరు ధర, తర్వాత భారీగా పడిపోయి 2026 ఏప్రిల్ నాటికి రూ.80కి చేరింది. తాజాగా మళ్లీ నష్టాల్లోకి వెళ్లి రూ.104 వద్ద స్థిరపడింది.

ఏ తప్పు చేయలేదన్న రాజేశ్ ఎక్స్‌ పోర్ట్స్‌

కంపెనీలో ఎల్‌ఐసీకి 10.8 శాతం వాటా ఉండగా, లక్షలాది రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడి పెట్టారు. దీంతో ఈ పరిణామాలు మదుపర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే కంపెనీ మాత్రం ఎటువంటి తప్పు చేయలేదని, సెబీతో సమాచార లోపం జరిగి ఉండొచ్చని వివరణ ఇచ్చింది. 2024లో వచ్చిన ఓ ఫిర్యాదు ఆధారంగా సెబీ ఈ దర్యాప్తు జరిపి 109 పేజీల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు