Homeఅంతర్జాతీయంEbola Vaccine: ఎబోలా కొత్త స్ట్రెయిన్‌కు వ్యాక్సిన్.. రష్యా కీలక ప్రకటన!

Ebola Vaccine: ఎబోలా కొత్త స్ట్రెయిన్‌కు వ్యాక్సిన్.. రష్యా కీలక ప్రకటన!

ప్రాణాంతక వ్యాధి  ఎబోలా వైరస్‌ ను అరికట్టే విషయంలో రష్యా కీలక ముందడుగు వేసింది. ఎబోలా వైరస్‌లో కొత్తగా గుర్తించిన ‘బుందిబుగ్యో’ స్ట్రెయిన్‌ ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు రష్యా ప్రకటించింది. ఈ విషయాన్ని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి  మిఖాయిల్ మురాష్కో వెల్లడించారు. ఈ సమాచారం దక్షిణాఫ్రికాలోని దక్షిణాఫ్రికాలోని రష్యా రాయబార కార్యాలయం అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం కాంగో ప్రాంతంలో వ్యాపిస్తున్న బుందిబుగ్యో స్ట్రెయిన్‌ నుంచి ఈ కొత్త టీకా రక్షణ కల్పిస్తుందని రష్యా తెలిపింది.

ఇప్పటికే 220 మంది మృతి

ఎబోలా వైరస్‌ లోని ఈ బుందిబుగ్యో రకం ఇటీవల ఆఫ్రికా దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కాంగోలో ఈ వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నట్లు సమాచారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం, ఇప్పటి వరకు ఈ వైరస్‌ కారణంగా అక్కడ 220 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ పరిస్థితిని ప్రజారోగ్య పరంగా అత్యంత ప్రమాదకరంగా అభివర్ణించింది. వైరస్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో అత్యవసర పరిస్థితిగా పరిగణిస్తున్నట్లు తెలిపింది.

ఇప్పటి వరకు నో వ్యాక్సీన్

ఇప్పటివరకు బుందిబుగ్యో స్ట్రెయిన్‌ను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన టీకా అందుబాటులో లేదు. దీంతో రష్యా తయారు చేసిన ఈ కొత్త వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. వైద్య నిపుణులు కూడా దీనిని కీలక అభివృద్ధిగా భావిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తుంది, పెద్ద ఎత్తున వినియోగానికి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే విషయాలపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. క్లినికల్‌ ట్రయల్స్‌, అంతర్జాతీయ అనుమతుల తర్వాతే దీని వినియోగంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఎబోలా వైరస్‌ చాలా ప్రమాదకరమైన అంటువ్యాధిగా గుర్తించబడింది. జ్వరం, రక్తస్రావం, అవయవాల వైఫల్యం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. సరైన చికిత్స అందకపోతే ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రపంచ ఆరోగ్య రంగానికి ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు