Homeతెలంగాణనిరుద్యోగుల‌ను మోసం చేసింది రేవంత్ సర్కార్‌....హ‌రీశ్ రావు ఫైర్‌

నిరుద్యోగుల‌ను మోసం చేసింది రేవంత్ సర్కార్‌….హ‌రీశ్ రావు ఫైర్‌

  • రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ…?

  • గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ అందోళన

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్‌: అధికారంలోకి వ‌స్తే నిరుద్యోగుల‌కు నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని మ‌భ్య పెట్టి అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు కావ‌స్తున్న దాని ఊసేత్త‌డం లేద‌ని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ స‌ర్కార్‌కు చిత్త‌శుద్ది ఉంటే నిరుద్యోగ భృతి అమ‌లుచేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు.

గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ “బాకీ కార్డులు” ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనలో పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా తెలంగాణను ఆగం చేశారని ఆరోపిస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. దివ్యాంగులకు బాకీ పడ్డ రూ.54,000 ఎక్కడ అని నిలదీశారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ? నిరుద్యోగ భృతి ఏమైంది? అంటూ ప్రశ్నించారు.

ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పిన రూ.24,000లో, సంవత్సరానికి రూ.12,000 చొప్పున రెండు సంవత్సరాలుగా బాకీ ఉందని విమర్శించారు. వృద్ధులకు ఇవ్వాల్సిన నెలకు రూ.4,000 చొప్పున మొత్తం రూ.54,000 బాకీ ఎక్కడ అని ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఇస్తామని చెప్పిన తులం బంగారం, ల‌క్ష‌రూపాయల చిల్ల‌ర న‌గ‌దు ఏమైంద‌ని దుయ్య‌బట్టారు. వారి వెంట బీఆర్ ఎస్ నాయ‌కుఉ, కార్య‌క‌ర్త‌లు ఉన్నారు.

తాజావార్తలు