Homeఆంధ్ర ప్రదేశ్టిడిపి పై రెడ్డి సామాజిక వర్గం ఆగ్రహం!

టిడిపి పై రెడ్డి సామాజిక వర్గం ఆగ్రహం!

•రాజ్యసభ పదవుల్లో దక్కని ప్రాతినిధ్యం
•రాయలసీమ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోని వైనం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:-
తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై రెడ్డి సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. ముఖ్యంగా రాజ్యసభ పదవుల ఎంపికలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆ వర్గం నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ఈసారి ప్రాధాన్యం దక్కకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల ఎంపిక జరిగిన సంగతి తెలిసిందే. అందులో రెండు పదవులు కమ్మ సామాజిక వర్గానికి.. ఒక పదవి రెడ్డి సామాజిక వర్గానికి.. మరో పదవి బీసీలకు కేటాయించారు. రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కకపోవడంతో ఆ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. టిడిపి నాయకత్వం పై రగిలిపోతోంది.

అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం..ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ పదవుల ఎంపిక పూర్తి చేశారు.. జనసేన నుంచి ఇప్పటికే లింగంనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. టిడిపికి సంబంధించి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పేరు ఖరారు చేశారు. రేపు ఈ ముగ్గురు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అయితే సామాజిక సమతూకం పేరుతో టిడిపి రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసింది. ఇందులో సానా సతీష్ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. భాష్యం రామకృష్ణ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక చింతకాయల విజయ్ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన యువనేత. కానీ రెడ్డి సామాజిక వర్గానికి ఈసారి ప్రాధాన్యం లేకపోవడంతో ఆ వర్గంలో తీవ్ర అసంతృప్తి రగిలిపోతుంది.

రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి ఆవేదన..చింతకాయల విజయ్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇక భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ కోస్తాంధ్రకు చెందిన వారు. సానా సతీష్ గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తి. రాయలసీమకు ప్రాతినిధ్యం లేకపోవడం, ఆ ప్రాంతంలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. దీనిపై కడప జిల్లాకు చెందిన టిడిపి నేత రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి బాహటంగానే విమర్శలకు దిగారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనలాంటి వారిని గుర్తించకపోవడం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎదుర్కొంటే.. కనీసం గుర్తించకపోవడం అన్యాయమన్నారు. అయినా సరే పార్టీ కోసం పనిచేస్తామని చెప్పుకొచ్చారు.

నష్ట నివారణ చర్యలు..మరోవైపు టిడిపి హై కమాండ్ నష్ట నివారణ చర్యలకు దిగింది. టిడిపి అగ్ర నేతలు నేరుగా అసంతృప్త నేతలకు ఫోన్లు చేస్తున్నారు. భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి నాయకుడికి గుర్తింపు ఇస్తామని అధినేత చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గం వారికి.. అందులోనూ రాయలసీమ ప్రాంతానికి రాజ్యసభ పదవుల విషయంలో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఇది నిజంగా ఆ ప్రాంతంతో పాటు ఆ సామాజిక వర్గానికి ఇబ్బందికరమే. కానీ భవిష్యత్తులో టిడిపి రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు