HomeజాతీయంRahul Gandhi: సభా హక్కుల తీర్మానం చేసినా నో ప్రాబ్లం.. వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్!

Rahul Gandhi: సభా హక్కుల తీర్మానం చేసినా నో ప్రాబ్లం.. వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్!

Rahul Gandhi Responds to No-Confidence Motion: లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వెల్లడించారు. తనపై సభా హక్కుల తీర్మానం పెట్టినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. తాను నిజమే చెప్పానని, చెబుతూనే ఉంటానని రాహుల్ తేల్చి చెప్పారు.

భరతమాతను అమ్మేశారు!

అమెరికాతో వాణిజ్య ఒప్పందం గురించి రాహుల్ గాంధీ లోక్‌సభలో జరిగిన బడ్జెట్ చర్చలో తీవ్ర విమర్శలు చేశారు.  అమెరికాతో ట్రేడ్ డీల్‌లో ఎలాంటి లాజిక్ లేదన్నారు. భారత్ ఎలాంటి దామాషా ప్రయోజనాలు పొందకుండానే సాగిలపడిందని ఆరోపించారు. ఇరాన్ నుంచో, రష్యా నుంచో, మరో చోట నుంచో చమురు కొనుగోలు చేయాలని అమెరికా ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. భరతమాతను అమ్మేశారు సిగ్గుపడాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఒత్తిడితో మోడీ వణికిపోయారని చెప్పుకొచ్చారు. భారత ఇంధన భద్రతను అమెరికాకు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడ్డారంటూ రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం

కాగా, రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జార్జ్ సోరోస్ వంటి శక్తుల సహాయంతో రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే విమర్శించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా, జీవితాంతం ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో  సబ్‌ స్టాంటివ్ మోషన్ దాఖలు చేశారు. ఆ కొద్దిసేపటికే రాహుల్ స్పందించారు. తనపై ఎలాంటి హక్కుల తీర్మానం పెట్టినా నిజమే చెబుతానని, వెనుకంజ వేసేది లేదని ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు