Homeక్రైమ్మ‌మ‌త బెన‌ర్జీని హ‌త్య‌చేసేందుకు కుట్ర‌...! క‌త్తితో వ‌చ్చిన యువ‌తి...పోలీసుల‌కు అప్ప‌గింత‌...

మ‌మ‌త బెన‌ర్జీని హ‌త్య‌చేసేందుకు కుట్ర‌…! క‌త్తితో వ‌చ్చిన యువ‌తి…పోలీసుల‌కు అప్ప‌గింత‌…

కోల్‌కతా, క్రైమ్‌మిర్ర‌ర్‌: తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ, ప‌శ్చిమ‌బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని హ‌త్య చేసేందుకు కుట్ర‌జ‌రిగింద‌ని టీఎంసీ నేత‌లు ఆరోపించారు. కోల్‌క‌తాలోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసం వెలుప‌ల ఈఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో పార్టీ నేత‌ల్లో తీవ్ర క‌ల‌క‌లం రేగింది. ఈ హ‌త్య‌కు కుట్ర ఎవ‌రి ప‌ని అని వారు ఆరా తీస్తున్నారు. కాగా దుర్గాపూజ మండపం ప్రారంభోత్సవానికి మమతా బెనర్జీ బయలుదేరుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవ‌డం క‌ల‌వ‌రం రేపింది. టీఎంసీ నేతలు, కార్యకర్తలు తెలిపిన వివరాల ప్రకారం ఒక యువతి కాళీఘాట్‌లోని మమత ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఆమె మమత చీరను లాగేందుకు ప్రయత్నించిందని, సదరు మహిళ తన చీరలో ఒక కత్తిని దాచి ఉంచినట్లు గుర్తించామని పార్టీ శ్రేణులు తెలిపాయి. వెంటనే అప్రమత్తమైన టీఎంసీ నేతలు, కార్యకర్తలు ఆ మహిళను పట్టుకుని కాళీఘాట్‌ పోలీసులకు అప్పగించారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. పూణెలో దారుణం.. కట్నం వేధింపులు భరించలేక మహిళా ఐటీ ఇంజనీర్ ఆత్మహత్య!
  2.  ప్ర‌మాద‌క‌ర స్థాయిలో ఎల్‌నినో….!ఏపీ రైతుల కిడ్నీల‌పై తీవ్ర ప్ర‌భావం…! నిపుణులు ఏం చెబుతున్నారంటే…
  3.  మీ అకౌంట్‌లో డ‌బ్బులు లేవా…! క్రెడిట్ లైన్ విధానంతో పేమెంట్స్‌…! అది ఎలాగంటే…
  4.  ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావుపై న‌టి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు…! అస‌లు ఏం జ‌రిగిందంటే…

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు