Homeక్రైమ్జూనియ‌ర్ న్యాయ‌వాదికి కిడ్నీలో రాళ్లు...ఆసుప‌త్రిలో చేరితే ప్రాణ‌మే పోయింది...!  మెడిక‌వ‌ర్‌లో ఏం జ‌రుగుతుంది...?

జూనియ‌ర్ న్యాయ‌వాదికి కిడ్నీలో రాళ్లు…ఆసుప‌త్రిలో చేరితే ప్రాణ‌మే పోయింది…!  మెడిక‌వ‌ర్‌లో ఏం జ‌రుగుతుంది…?

హైద‌రాబ‌బాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌:మ‌ల్కాజిగిరికి చెందిన జూనియ‌ర్ న్యాయ‌వాదికి వివాహం జ‌రిగిన నెల‌న్న‌ర క్రిత‌మే వివాహం జ‌రిగింది. కాగా క‌డుపులో నొప్పి రావ‌డంతో ప‌రీక్షించిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నాయ‌ని చెప్ప‌డంతో ఓ కార్పొరేట్ ఆసుప‌త్రిలో చేరింది. తీరా మూత్ర‌పిండంలో రాయిని తీస్తేమెద‌డులో తీవ్ర ర‌క్త‌స్రావ‌మై చ‌నిపోయింద‌ని వైద్యులు చెప్ప‌డంతో ఆ ప్రాంతంలో ఒక్క‌సారిగా క‌ల‌క‌ల రేగింది. దీంతో తోటి అడ్వ‌కేట్లు, బంధువులు డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే చ‌నిపోయింద‌ని మంగ‌ళ‌వారం హాస్పిట‌ల్ ఎదుట ఆందోళ‌న చేప‌ట్టారు. బంధువులు, న్యాయవాదులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన సుధీర్‌కుమార్‌- గాయత్రీదేవి కూతురు ఐశ్వర్య (28) జూనియర్‌ న్యాయవాదిగా ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది. 40 రోజుల కిత్రమే పట్టాభి తో వివాహం జరిగింది. ఇటీవల కడుపులో నొప్పి రావడంతో వైద్యుల దగ్గర చూపించుకోగా కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పారు.

ఆపరేషన్‌ కోసం ఈ నెల 7న సికింద్రాబాద్‌ మెడికవర్‌ హాస్పిటల్‌లో చేరింది. అదే రోజున ఆమెకు శస్త్రచికిత్స చేశారు. 2 ఎంఎం సైజు రాళ్లు ఉన్న ఆమెకు అవసరం లేకున్నా ఆపరేషన్‌ చేశారని, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అపస్మారక స్థితికి చేరుకున్నదని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆమెను బ్రెయిన్‌ డెడ్‌కు గురైందని చెప్తున్నారని హాస్పిటల్‌ ఎదుట ఆదోళనకు దిగారు. పెద్ద ఎత్తున న్యాయవాదులు తరలివచ్చి సదరు డాక్టర్లను వెంటనే అరెస్టు చేయాలని, హాస్పిటల్‌ను సీజ్‌ చేయాలని నినాదాలు చేశారు. ఐశ్వర్య చికిత్స కోసం ఇప్పటి వరకు రూ.7 లక్షలు ఖర్చు చేసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గోపాలపురం, మార్కెట్‌, తుకారాం గేట్‌, హాస్పిటల్‌ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి బంధువులకు నచ్చజెప్పారు. కాగా ఐశ్య‌ర్య ఆరోగ్య‌ప‌రిస్థితిపై సికింద్రాబాద్ మెడికోవ‌ర్ యాజ‌మాన్యం స్పందించింది. తీవ్ర‌క‌డుపు నొప్పితో ఆసుప‌త్రిలో అక్టోబ‌ర్ 7న చేరిన ఐశ్య‌ర్య‌(28) కు కిడ్నీ నుంచి మూత్రం ప్ర‌వ‌హించే మార్గంలో అడ్డుగా ఉన్న రాయిని ఆప‌రేష‌న్ ద్వారా తొల‌గించ‌గా ర‌క్తంలో ప్లేట్‌లు, తెల్ల‌ర‌క్త‌క‌నాలు త‌గ్గ‌డంతో శ‌రీరంలో వాపు వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. దీంతో ఎంఐసీయుత‌ర‌లించి చికిత్స అందించిన‌ప్ప‌టికీ సిటీస్కాన్ లో చూడ‌గా మెద‌డులో ర‌క్త స్రావ‌మైన‌ట్లు గుర్తించారు. ప్లేట్‌ల సంఖ్య త‌క్క‌వుగా ఉండడంతో చికిత్స అందించిన‌ట్లు పేర్కొన్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:

  1. నాణ్య‌మైన క‌రెంటు ఇవ్వాలి…! బెల్లంప‌ల్లి స‌బ్‌స్టేష‌న్ ఎదుట రైతుల నిర‌స‌న‌…
  2.  భారీ దోపిడి…! క‌ళ్ల‌లో పెప్ప‌ర్ స్ర్పే కొట్టి 21ల‌క్ష‌ల తో ఉడాయింపు…!
  3. రైలు ఎక్క‌బోయి కింద‌ప‌డిపోయిన తండ్రి, కూతురు…! ఎలా కాపాడారంటే…
  4. ఘోర రోడ్డు ప్ర‌మాదం…! మిమిక్రీ ఆర్టిస్టు దుర్మ‌ర‌ణం…

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు