Homeతెలంగాణగ్యాస్ అంద‌క ప్ర‌జ‌లు పొగ‌లో వంట‌లు...!ఎంపీ గ‌డ్డం వంశీక్రిష్ణ‌...!

గ్యాస్ అంద‌క ప్ర‌జ‌లు పొగ‌లో వంట‌లు…!ఎంపీ గ‌డ్డం వంశీక్రిష్ణ‌…!

  • క‌ట్టెల పొయ్యితో నిర‌స‌న‌

పెద్దపల్లి, క్రైమ్ మిర్ర‌ర్‌: గ్యాస్ కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రతిబింబిస్తూ, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కట్టెల పొయ్యిపై స్వయంగా వంట చేస్తూ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, “దేశం అంతర్జాతీయ వేదికలపై గొప్పగా కనిపించడం ఒక వైపు అయితే, గ్రామాల్లో ప్రజలు గ్యాస్ సిలిండర్ లేక మళ్లీ కట్టెలకు వెళ్లాల్సిన పరిస్థితి మరో వైపు ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ విధానాల వైఫల్యానికి నిదర్శనం” అన్నారు.

గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు మళ్లీ పొగలో వంట చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు.ప్రచారాలకంటే ప్రజల ప్రాథమిక అవసరాలపై దృష్టి పెట్టాలని, గ్యాస్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ డిమాండ్ చేశారు.ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి తరఫున పోరాటం కొనసాగిస్తామని ఎంపీ స్పష్టం చేశారు.

తాజావార్తలు